నన్ను వదిలి నీవు – Nannu Vadhali Song Lyrics – Manchi Manasulu
నన్ను వదిలి నీవు పొలేవులే, అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే ... లేదులే
నన్ను వదిలి నీవు పొలేవులే, అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే ... లేదులే
తావి లేని పూవు విలువలేనిదే ఇదీ నిజములే
నేను లేని నీవు లేనే లేవులే లేవులే
తావి లేని పూవు విలువలేనిదే ఇదీ నిజములే
నేను లేని నీవు లేనే లేవులే లేవులే
నా మనసేచిక్కుకునే నీ చూపుల వలలో
నా మనసు నా సొగసు నిండేను నీ మదిలో
నా మనసేచిక్కుకునే నీ చూపుల వలలో
నా మనసు నా సొగసు నిండేను నీ మదిలో
చిరకాలపు నా కలలే ఈ నాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈ నాటికి నిజమాయె
దూర దూర తీరాలు చేరువైపోయే.. ఓ
తావి లేని పూవు విలువలేనిదే ఇదీ నిజములే
నేను లేని నీవు లేనే లేవులే లేవులే
సిగ్గు తెరలలో కనులు దించుకొనీ తలను వంచుకొనీ
బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడ
సిగ్గు తెరలలో కనులు దించుకొనీ తలను వంచుకొనీ
బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడ
రంగులీను నీ మెడలో బంగారపు తాలికట్టి
పొంగిపోవు శుభదినము రానున్నది లే... ఓ
నన్ను వదిలి నీవు పొలేవులే ఆది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే లేదులే.
తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగా
నీ మేని హోయలు నీలోని వాగలు నాలొన గిలిగింత లిడగా
హృదయాలు కలసి ఉయ్యాల లూగి
ఆకాసమే అందు కొనగా
పై పైకి సాగి మేఘాల దాటి కనరాని లోకాలు కనగా
ఆహో.. ఒహో.. ఊ.. ఊ… ఓ ..ఓ.. ఓ.. ఓ..
నిన్ను వదిలి నీవు పొలేవులే అది నిజములే
నీవు లేని నేను లేనే లేనులే లేనులే
నిన్ను వదిలి నీవు పొలేవులే అది నిజములే
నీవు లేని నేను లేనే లేనులే లేనులే
వ్యాఖ్యానించండి