Ambaraala Veedhilo (అంబరాల వీధిలో) Song Lyrics in Telugu ARM

Written by:

అంబరాల వీధిలో చిన్ని చందమామ రా
అందున ఒదిగుంది రా
చెవుల పిల్లిరా

నీడ నీలి దీవిలో
నీటి మీద మెరిసెరా
ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా

ఆ మాయ తాబేలుకి తాంబూలా
పేటిక కట్టుందిరా
తాపీగా ఈదుకుంటూ నీళ్లలో
ఏమూలో దాక్కుంది రా

తార లాంటి ఆకారం తాళమే
దానికి వేసుందిరా
లెక్కనే పెట్టలేని ఒక్కలే
అందులో ఉన్నయిరా

బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలీ జో లాలీ జో నాన్న

సరదాగా ఆడు మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు హ్మ్మ్…
లాలీ జో లాలీ జో హ్మ్…
లాలీ జో లాలీ జో

నీ సుధూర ​​దారిలో ఆగకుండా సాగిపో
చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఆ ఆ..

ఎదురు నీకు లేదులే
అడ్డు నీకు రాదులే
దారినిచ్చి జరుగులే నీటి అలలివే

నిశ్చింత గానే ఉండు
గాలులే నొప్పిని తీర్చ రావా
ఆకాశ నక్షత్రాలే
దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా

నీ ముందు అగ్గి పుట్టె
చీకట్లే పారదోల కదిలే
నువ్వోక్క విత్తు వేస్తే
ఈ మన్ను అడవళ్లే మార్చేయదా

బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలీ జో లాలీ జో నాన్న

సరదాగా ఆడు మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు

నిలవర… నిలవర..
పరుగున లే కదలరా
నిలవర… నిలవర..
జగమునే నువ్ గెలవరా

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి