నా గుండెల్లో ఉండుండి – Naa Gundello Song Lyrics – Majili
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా ఝల్లుమందే ఏమయ్యిందో
నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా ఇష్టంగుందే ఏమవుతుందో
మదిలో మెదిలే మాటలనే పెదవే దాచనందే
యెదలో ఎగసే అలజడినే అడగాలీ మన కథే
ఓ ఓ... నా గుండెల్లో ఉండుండి మెల్లంగా ఝల్లుమందే ఏమయ్యిందో
ఏల అందిందే ఆకాశం అందేసిందే
ఏల ఆనందం పొంగిందే
ఏల అల్లిందే ఉల్లాసం అల్లేసిందే
ఏల ఒళ్ళంతా తుళ్ళిందే
ఇంచుమించుగా ఊపిరి ఆగేట్టుందిలే
నువ్వే చూసి చూడనట్టు వెళ్లకే
కొంచెం కొంచెంగా మౌనం కరిగేట్టుందిలే
నువ్వే మంత్రం వేసి మనసే లాగితే
మన మాటే
పాటగా మారనీ
మన పాటే
ప్రేమగా సాగనీ
ఆ ప్రేమే స్వప్నమై సత్యమై స్వర్గమైపోనీ
మన కలయికలో
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా ఝల్లుమందే ఏమయ్యిందో
మంచు పువ్వంటి చిన్ని నవ్వు నవ్వేస్తే
పంచ ప్రాణాలన్ని మళ్లీ పుట్టేలే
పంచదారంటి తీపి ఊసులాడేస్తే
లక్ష నిమిషాలైనా ఇట్టే గడిచేలే
సంద్రమైనా చిటికెలో దాటనా
సందెపొద్దు జిలుగులో చేరనా
మధురం మధురం మధురం మన ఈ ప్రేమం
సుమధుర కావ్యం
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా ఝల్లుమందే ఏమయ్యిందో
నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా ఇష్టంగుందే ఏమవుతుందో
మదిలో మెదిలే మాటలనే పెదవే దాచనందే
యెదలో ఎగసే అలజడినే అడగాలీ మన కథే ఓ ఓ...
వ్యాఖ్యానించండి