దేవుడు వరమందిస్తే – Devudu Varamandisthe Song Lyrics – Six Teens
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోను. నిన్నే నీ నీడై చేరుకుంటాలే
ఓ
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
హ
నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే
ఓహ్ కాశ్మీరులో కనపడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే
హా
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
మనసు నిన్ను చూస్తునే నన్ను మరచిపోయిందే
మాటనై వినకుండా నిన్ను చేరమంటుదే
నా మనసు నిన్ను చూస్తునే నన్ను మరచిపోయిందే
మాటనై వినకుండా నిన్ను చేరమంటుదే
నిను మేఘాన ఒక బొమ్మ గావించగా
నే మలిచాను హరివిల్లు నీ కుంచెగా
ఈ చిరుగాలితో చెప్పనా నీ మది నిండ నేనుండగా
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
ఓహ్... నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే
ఏడడుగులు నడవాలంటు నా అడుగులు పరుగిడినా
కొంగు ముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నా
హా ..ఏడడుగులు నడవాలంటు నా అడుగులు పరుగిడినా
కొంగు ముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నా
నా కలలన్నీ నీ కనులు చూడలనీ
బతిమలాను నీ కంటిలో పాపనీ
మన్నించేసి నా మనసుని ప్రసాదించు నీ ప్రేమనీ
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
ఓ నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే
హో ... కాశ్మీరులో కనపడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే
హో ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
వ్యాఖ్యానించండి