విరిసినది వసంతగానం – Virisinadi Vasantha Ganam Song Lyrics – Bhairava Dweepam

Written by:

విరిసినది వసంతగానం – Virisinadi Vasantha Ganam Song Lyrics – Bhairava Dweepam

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా 
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా 
మనసే మందారమై వయసే మకరందమై 
అదేదో మాయ చేసినది 
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా 

ఝుమ్మంది నాదం రతివేదం జతగూడే భ్రమర నాదం 
రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమల మైకం 
పరువాల వాహిని ప్రవహించె ఈ వని 
ప్రభవించె ఆమని పులకించె కామిని 
వసంతుడే చెలికాంతుడై దరిచేరే మెల్లగా 

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా 

ఋతువు మహిమేమో విరితేనె జడివానై కురిసె తీయగా 
లతలు పెనవేయ మైమరచి మురిసేను తరువు హాయిగా 
రాచిలుక పాడగా రాయంచ ఆడగా 
రసలీల తోడుగా తనువెల్ల ఊగగా 
మారుడే సుకుమారుడై జతగూడె మాయగా 

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా 
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా 
మనసే మందారమై వయసే మకరందమై 
అదేదో మాయ చేసినది 
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా 
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి