జగదానంద కారకా – Jagadhanandha Kaaraka Song Lyrics – Sri Rama Rajyam 

Written by:

జగదానంద కారకా – Jagadhanandha Kaaraka Song Lyrics – Sri Rama Rajyam 

జగదానంద కారకా 
జయ జానకీ ప్రాణ నాయకా 
జగదానంద కారకా 
జయ జానకీ ప్రాణ నాయకా 
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా 

జగదానంద కారకా 
జయ జానకీ ప్రాణ నాయకా 
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా 

మంగలకరమౌ నీ రాక 
ధర్మానికి వేదిక అవుగాక 
మా జీవనమె ఇక పావనమౌగాక 

నీ పాలన శ్రీకరమౌగాక 
సుఖశాంతులు సంపదలిడుగాక 
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక 

జగదానంద కారకా 
జయ జానకీ ప్రాణ నాయకా 
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా 

సార్వభౌమునిగ పూర్నకుంబములె 
స్వాగతాలు పలికే 
రాజ్యమేలమని ధర్మదేవతే 
రాగమాల పాడే 

నాల్గు వేదములు తన్మయత్వమున 
జలధి మారు మ్రోగే 
న్యాయ దేవతే శంకమూదగా 
పూలవాన కురిసె 

రాజమకుటమే వొసగెలె 
నవరత్న కాంతి నీరాజనం 

సూర్యవంశ సింహాసనం 
పులకించి చేసే అభివందనం 

సామ్రాజ్య లక్ష్మియే పాధ స్పర్ష కి 
పరవసించె పొయే 

జగదానంద కారకా 
జయ జానకీ ప్రాణ నాయకా 
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా 

జగదానంద కారకా 
జయ జానకీ ప్రాణ నాయకా 
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా 

రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే 
రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే 

రామ దర్షనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే 
రామ రాజ్యమె పౌరులందరిని నీతి బాట నిలిపే 

రామ మంత్రమె తారకం భహు శక్తి ముక్తి సందాయకం 
రామ నామమె అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం 
ఈ రామచంద్రుడే లొకరక్షయని అంతరాత్మ పలికే 

జగదానంద కారకా 
జయ జానకీ ప్రాణ నాయకా 
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా 

జగదానంద కారకా 
జయ జానకీ ప్రాణ నాయకా 
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా 

మంగలకరమౌ నీ రాక 
ధర్మానికి వేదిక అవుగాక 
మా జీవనమె ఇక పావనమౌగాక 

నీ పాలన శ్రీకరమౌగాక 
సుఖశాంతులు సంపదలిడుగాక 
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక 

జగదానంద కారకా 
జయ జానకీ ప్రాణ నాయకా 
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి