ఈ జీవనతరంగాలలో – Ee Jeevana Tarangalalo Song Lyrics – Jeevana Tarangalu
పదిమాసాలు మోశావు పిల్లలను
బ్రతుకంతా మోశావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక
వెళుతున్నావు
ఈ జీవనతరంగాలలో...
ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము...
ఎంతవరకీ బంధము
కడుపు చించుకు పుట్టిందొకరు
కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు
ఆపై నీతో వచ్చేదెవరు...
ఆపై నీతో వచ్చేదెవరు
ఈ జీవనతరంగాలలో...
ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము...
ఎంతవరకీ బంధము
మమతే మనిషికి బందిఖానా
భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటబడి
ఋణం తీర్చుకోమంటుంది
తెలియని పాశం వెంటబడి
ఋణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది
ఈ జీవనతరంగాలలో...
ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము...
ఎంతవరకీ బంధము
తాళి కట్టిన మగడు లేడని
తరలించుకు పోయే మృత్యువాగదు
ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు
ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు
ఈ మంటలు ఆ గుండెను అంటక మా..నవు
ఈ జీవనతరంగాలలో...
ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము...
ఎంతవరకీ బంధము
ఈ జీవనతరంగాలలో...
వ్యాఖ్యానించండి