దేవుడే దిగి వచ్చిన – Devude Dhigivachina Song Lyrics – Santosham
దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన
షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహాల్ రాసిచ్చిన
ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగ ఉంది ఈ దినం
నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకశం
ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం
ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం
దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం
కోయిల నేర్చుకో ఇలా ఆమె నవ్వులో తేనె సంతకం
హాయిగ పీల్చుకో ఇలా చల్ల గాలిలో ఆమె పరిమళం
నీటిపై చందమామల నేడు తేలుతూ ఉంది నా మది
చీటికి మాటి మాటికి కొత్త కొత్తగ ఉంది యేమది
అణువంతే ఉంటుందమ్మ ప్రేమా
అణచాలి అనుకొన్నామ చేస్తుందమ్మ హంగామా
దేవుడే దిగివచ్చిన స్వర్గమే నాకిచ్చిన
షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహాల్ రాసిచ్చిన
ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
వ్యాఖ్యానించండి