నువ్వంటె నాకిష్టమనీ – Nuvante Nakistamani Song Lyrics – Santhosham

Written by:

నువ్వంటె నాకిష్టమనీ – Nuvante Nakistamani Song Lyrics – Santhosham

నువ్వంటె నాకిష్టమనీ.. అన్నది నా ప్రతి శ్వాసా 
నువ్వేలె నా లోకమనీ.. అన్నది నా ప్రతి ఆశా 
నీ నవ్వులో.. శ్రుతి కలిపి పాడగా 
నీ నీడలో.. అణువణువు ఆడగా 
అనురాగం.. పలికిందీ.. సంతోషం స్వరాలుగా 

నువ్వంటె నాకిష్టమనీ.. అన్నది నా ప్రతి శ్వాసా 
నువ్వేలె నా లోకమనీ.. అన్నది నా ప్రతి ఆశా 

నువ్వు నా వెంట ఉంటే.. అడుగడుగునా నడుపుతుంటే 
ఎదురయే.. నా ప్రతి కలా.. నిజమల్లె కనిపించదా 
నిన్నిలా చూస్తు ఉంటే.. మైమరపు నన్నల్లుకుంటే 
కనపడే.. నిజమే ఇలా.. కలలాగ అనిపించదా 
వరాలన్ని సూటిగా.. ఇలా నన్ను చేరగా 
సుదూరాల తారకా.. సమీపాన వాలగా 
లేనేలేదు.. ఇంకే.. కోరికా 

నువ్వంటె నాకిష్టమనీ.. అన్నది నా ప్రతి శ్వాసా 
నువ్వేలె నా లోకమనీ.. అన్నది నా ప్రతి ఆశా 

ఆగిపోవాలి కాలం.. మన సొంతమై యెల్లకాలం 
నిన్నగా.. సన సన్నగా.. చేజారిపోనీయకా 
చూడు నా ఇంద్రజాలం.. వెనుతిరిగి వస్తుంది కాలం 
రేపుగా.. మన పాపగా.. పుడుతుంది సరి కొత్తగా 
నూవు నాకు తోడుగా.. నేను నీకు నీడగా 
ప్రతి రేయి తీయగా.. పిలుస్తోంది హాయిగా 
ఇలా ఉండిపోతె.. చాలుగా 

నువ్వంటె నాకిష్టమనీ.. అన్నది నా ప్రతి శ్వాసా 
నువ్వేలె నా లోకమనీ.. అన్నది నా ప్రతి ఆశా 
నీ నవ్వులో.. శ్రుతి కలిపి పాడగా 
నీ నీడలో.. అణువణువు ఆడగా 
అనురాగం.. పలికిందీ.. సంతోషం స్వరాలుగా 

నువ్వంటె నాకిష్టమనీ.. అన్నది నా ప్రతి శ్వాసా 
నువ్వేలె నా లోకమనీ.. అన్నది నా ప్రతి ఆశా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి