నిన్నేనా నేను – Ninnena Nenu Song Lyrics – Salute

Written by:

నిన్నేనా నేను – Ninnena Nenu Song Lyrics – Salute

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా 
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా 
కోపంలో నిప్పుల కొండలా 
రూపంలో చుక్కల దండలా 
నవ్వుల్లో చిలకమ్మలా 
చిన్నారుల చేతికి బొమ్మలా 

ఇంతకీ నువ్వొకడివా వందవా 
ఎంతకీ నువ్వెవరికీ అందవా ! 

కొత్తగా లవ్ లో పడుతుంటే .. 
కొద్దిగా ఇదిలా ఉంటుంది 
ముందుగా మనసుకి తెలిసుందే .. 
ముందుకే నెడుతూ ఉంటుంది 
తప్పుకాబోలనుకుంటూనే .. 
తప్పుకోలేననుకుంటుంది 
నొప్పిలో తీపి కలుస్తుందే .. 
రెప్పలో రేపు కురుస్తుందీ 

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా 
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా 
కోపంలో నిప్పుల కొండలా ..
రూపంలో చుక్కల దండలా 
నవ్వుల్లో చిలకమ్మలా .. 
చిన్నారుల చేతికి బొమ్మలా 
ఇంతకీ నువ్వొకడివా వందవా ..
ఎంతకీ నువ్వెవరికీ అందవా ! 

తడవక నడిపే .. గొడుగనుకోనా 
అడుగుల సడిలో .. పిడుగైనా 
మగతను పెంచే .. మగతనమున్నా 
మునివనిపించే .. బిగువేనా 
ముళ్ళలా నీ కళ్ళలా నను గిల్లిపోతున్నవా 
పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా
నాకేమౌతావో చెప్పవ ఇపుడైనా ! 

చెప్పమని అడిగేం లాభంలే .. 
ఎప్పుడో పొందిన ఆన్సర్లే 
ఉత్తినే వేసే కొచ్చిన్లే .. 
ఊరికే తీసే ఆరాలే 
నిదర చెడగొట్టే నేరాలై .. 
కుదురుగా ఉంచని తొందరలే 
దరిమిలా అంతా నీవల్లే ..
అంటు నిలదీసే నిందల్లే 

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా 
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా 

బిత్తరపోయే .. బెదురొదిలించూ 
కొత్తగ తెగువే .. కలిగించూ 
కత్తెర పదునై .. బిడియము తెంచూ 
అత్తరు సుడివై .. నను ముంచూ 
చెంప కుట్టే తేనె పట్టై ముద్దులే తరమనీ 
చెమట పుట్టే పరుగు పెట్టీ హద్దులే కరగనీ 
అని అడగాలన్నా అడిగెయ్ లేకున్నా ! 

చెప్పమని అడిగేం లాభంలే .. 
ఎప్పుడో పొందిన ఆన్సర్లే 
ఉత్తినే వేసే కొచ్చిన్లే .. 
ఊరికే తీసే ఆరాలే 
నిదర చెడగొట్టే నేరాలై .. 
కుదురుగా ఉంచని తొందరలే 
దరిమిలా అంతా నీవల్లే .. 
అంటు నిలదీసే నిందల్లే 

హో .. నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా 
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా 
కోపంలో నిప్పుల కొండలా ..
రూపంలో చుక్కల దండలా 
నవ్వుల్లో చిలకమ్మలా .. 
చిన్నారుల చేతికి బొమ్మలా 
ఇంతకీ నువ్వొకడివా వందవా హా ..
ఎంతకీ నువ్వెవరికీ అందవా ! 
ఇంతకీ నువ్వొకడివా వందవా ఆ ఆ ..
ఎంతకీ నువ్వెవరికీ అందవా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి