పువ్వుల్లో దాగున్న – Poovullo Daagunna Song Lyrics – Jeans
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం..
ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం..
వేణువులో గాలి సంగీతాలే అతిశయం..
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం..
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం..
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు
ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం..
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం..
ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం..
వేణువులో గాలి సంగీతాలే అతిశయం..
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం..
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం..
ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నై..
పూలవాసనతిశయమే..
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా..
వాన నీరు అతిశయమే..
విద్యుత్తే లేకుండా వ్రేలాడే దీపాల్లా
వెలిగేటి మిణుగురులతిశయమే..
తనువున ప్రాణం ఏ చోటనున్నదో
ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే..
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం..
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం..
ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం..
వేణువులో గాలి సంగీతాలే అతిశయం..
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం..
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం..
అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొచ్చే..
నీవే నా అతిశయమే..
జగమున అతిశయాలు ఏడైనా..ఓ.. మాట్లాడే పువ్వా ను
ఎనిమిదవ అతిశయమే..
నింగి లాంటి నీ కళ్ళు,పాలుగారే చెక్కిళ్ళు..
తేనెలూరే అధరాలు అతిశయమే..
మగువ చేతి వేళ్ళు అతిశయమే..
మకుటాలంటి గోళ్ళు అతిశయమే..
కదిలే ఒంపులు అతిశయమే..
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు
ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం..
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో
అతిశయం..
ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో
అతిశయం..
వేణువులో గాలి సంగీతాలే
అతిశయం..
గురువెవ్వరు లేని కోయిల పాటే
అతిశయం..
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం..
వ్యాఖ్యానించండి