ఏ కన్నులు చూడనీ చిత్రమే – Ye Kannulu Choodani Song Lyrics – Ardhashathabdam
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా
కొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనా
దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా
నువ్వు చూడగానే దాగిపోతువున్నా
నినుతలచి ప్రతినిమిషం
పరవశమై పరుగులనే
తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా..
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా
నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిది తెలియదులే
మనసుకిది మధురములే
నాలో నే మురిసి ఓ వేకువలా
వెలుగైవున్నా..
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
వ్యాఖ్యానించండి