ఆశ పాశం బందీ సేసెలే – Asha Pasham Song Lyrics – CO Kancherapalem
ఆశ పాశం బందీ సేసెలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం చేరేలోగానే
యే తీరవునో
చేరువైన సేదు దూరాలే
తోడవుతూనే వీడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఏటేటవునో
ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా
యేలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో ఏలేలో
య ద కొలనుల్లో
నిండు పున్నమిలా మబ్బు కమ్ముకొచ్చి
చిమ్మ చీకటల్లి పోతుంటే
నీ గమ్యం గందర గోళం
దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ
అల్లడిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం
ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపెటావునో తేలాలంటే
నీ ఉనికి ఉండాలిగా
హె ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా
ఆశ పాశం బందీ సేసెలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం చేరేలోగానే
యే తీరవునో
యే జాడలో ఏమున్నదో
రేనీడలా విధి వేచున్నదో
యే మలుపులో ఎం దాగున్నదో
నేరుగా తేల్చుకో నీ శైలిలో
సిగ్గు ముళ్ళు కప్పి రంగులీదుతుంటే
లోకమంటే పెద్ద నాటకమే
తెలియకనే సాగే కథనం
నీవు పెట్టుకున్న నమ్మకాలు
అన్ని పక్కదారి పట్టి పోతుంటే
కంచికి నీ కథలే దూరం
మీ సేతుల్లో ఉంది
సేతల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా
రేపెటావునో తేలాలంటే
నువ్ ఎదురు సూడాలిగా
ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్న
వ్యాఖ్యానించండి