పుణ్యభూమి నా దేశం – Punya Bhoomi Naa Desham Song Lyrics – Major Chandrakanth

Written by:

పుణ్యభూమి నా దేశం – Punya Bhoomi Naa Desham Song Lyrics – Major Chandrakanth

పుణ్యభూమి నా దేశం నమో నమామీ 
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ 

పుణ్యభూమి నా దేశం నమో నమామీ 
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ 
నన్ను కన్న నా దేశం నమో నమామీ 
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ 
మహామహుల కన్న తల్లి నా దేశం 
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం నా దేశం 

పుణ్యభూమి నా దేశం నమో నమామీ 
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ 

అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి 
మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే 
మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే 
(ఆఆఆ) 
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి 
మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు 
సార్వభౌముడు 

అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన 
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన 
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన 
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన 

ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు 
నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా 
ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు 
శిస్తెందుకు కట్టాలి రా 
అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి 
ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు 
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు 

పుణ్యభూమి నా దేశం నమో నమామీ 
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ 
నన్ను కన్న నా దేశం నమో నమామీ 
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ 

అదిగదిగో 
అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి 
వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి 
అగ్గి పిడుగు అల్లూరి 

ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు 
ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు 
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి 
పన్నులడిగే కొమ్ములొ చ్చిన దమ్ములెవడికి వచ్చెరా 

బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే 
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా 

అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెట్టి 
మర ఫిరంగులెక్కు పెట్టి 
వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే 

వందే మాతరం (వందే మాతరం) 
వందే మాతరం (వందే మాతరం) 
వందే మాతరం అన్నది ఆ ఆకాశం 

ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి 
అఖండ భరత జాతి కన్న మరో శివాజి 
సాయుధ సంగ్రామమే న్యాయమని 
స్వతంత్ర భారతావని మన స్వర్గమని 
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని 
హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు 
గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు 

జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ 
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ 

గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం 
సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధ్రువతారల కన్నది ఈ దేశం 
చరితార్దులకన్నది నా భారత దేశం నా దేశం 

పుణ్యభూమి నా దేశం నమో నమామీ 
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ 
నన్ను కన్న నా దేశం నమో నమామీ 
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి