ఇందిరమ్మ ఇంటి పేరు – Indiramma Intiperu Song Lyrics – Mahatma

Written by:

ఇందిరమ్మ ఇంటి పేరు – Indiramma Intiperu Song Lyrics – Mahatma

రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం 
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్ 

కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ 
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ 
కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ 
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ 

కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద 
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ 
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ 
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ 
కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ 
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ 

రామనామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా 
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత 
అపురూపం ఆ చరిత... 

కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా 
సంభవామి యని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత 
ఈ బోసి నోటి తాతా... 

మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ... 
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి... 
సత్యాహింసల మార్గజ్యోతి.. 
నవశకానికే నాంది.. 

రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం 
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్ 
రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం 
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్ 

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి 
దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత.. 
సిసలైన జగజ్జేత... 
చరకాయంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి.. 
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత... 
సంకల్ప బలం చేత... 

సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చుపిన క్రాంతి 
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి 
పదవులు కోరని పావన మూర్తి.. 
హృదయాలేలిన చక్రవర్తి.. 

ఇలాంటి నరుడొకడిలాతలంపై నడియాడిన ఈనాటి సంగతి 
నమ్మరానిదని నమ్మకముందే ముందుతరాలకి చెప్పండి 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి