చిటపట చినుకులు – Chitapata Chinukulu Song Lyrics – Aatma Balam

Written by:

చిటపట చినుకులు – Chitapata Chinukulu Song Lyrics – Aatma Balam

చిటపట చినుకులు పడుతూ ఉంటే 
చెలికాడె సరసన ఉంటే 
చెట్టాపట్టగ చేతులు పట్టి 
చెట్టు నీడకై పరుగిడుతుంటే 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 

ఉరుములు పెళపెళ ఉరుముతు ఉంటే 
మెరుపులు తళ తళ మెరుస్తు ఉంటే 
మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనపడుతుంటే 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి 

కారు మబ్బులు కమ్ముతు ఉంటే 
కమ్ముతు ఉంటే
ఓ.ఓ.కళ్ళకు ఎవరూ కనపడకుంటే 
కనపడకుంటే 
ఆ...కారు మబ్బులు కమ్ముతు ఉంటే 
కమ్ముతు ఉంటే 
ఓ...ఓ.కళ్ళకు ఎవరూ కనపడకుంటే
కనపడకుంటే 
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే 
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే 
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 

చలి చలిగా గిలివెస్తుంటే 
ఆ హా హా 
గిలిగింతలు పెడుతూ ఉంటే 
ఓహోహో 
చలి చలిగా గిలివెస్తుంటే 
ఆ హా హా 
గిలిగింతలు పెడుతూ ఉంటే 
ఓహోహో 
చెలి గుండెయిలో రగిలే వగలే 
చెలి గుండెయిలో రగిలే వగలే చలిమంటలుగా అనుకుంటే 
చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 
చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 

చిటపట చినుకులు పడుతూ ఉంటే 
చెలికాడె సరసన ఉంటే 
చెట్టాపట్టగ చేతులు పట్టి 
చెట్టు నీడకై పరుగిడుతుంటే 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి