రా రా కుమారా – Ra Ra Kumara Song Lyrics – Govindudu Andarivaadele

Written by:

రా రా కుమారా – Ra Ra Kumara Song Lyrics – Govindudu Andarivaadele

రా రా కుమారా రాజసాన ఏలగా 
ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా 
నీవు తీసె శ్వాసలో 
ఊయలూగే ఆశతో 
పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా… 

రా రా కుమారా రాజసాన ఏలగా 
ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా 

నీ తలపులతో మరిగిపోయె 
ఒంటరి తనమూ ఇష్టమే 
నీ కబురులతో కరిగిపోయె 
ప్రతి ఒక క్షణమూ ఇష్టమే 
కలలే నిజమయేలా కళ్లు 
తెరిచిన కోరిక ఇష్టం 
నిజమే కల అయేలా ఒళ్లు 
మరచిన అయోమయం మరింత ఇష్టం 

రా రా రాకుమారా రాజసాన ఏలగా
ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా

బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ 
నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని 
ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరోవరం ఏదైనా గానీ… 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి