జివ్వుమని కొండగాలి – Jivvumani Kondagali Song Lyrics – Lankeshwarudu
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం
కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
తీయని కానుక దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
వొంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
వొంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
కాశ్మీర కొండల్లో అందాలకే
కొత్త అందాలు ఇచ్చావో
కాశ్మీర వాగ్గుల్లో పరుగులకే
కొత్త అడుగులనే నేర్పవో
నేనే నిను కోరి చేరి వాలిపోవాలి
కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
మంచల్లె కరగాలి మురిపాలు
సెలయేరల్లె ఉరకాలి యవ్వనాలు
మంచల్లె కరగాలి మురిపాలు
సెలయేరల్లె ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లో పూలన్నీ పానుపుగా
మన ముందుంచే పూలగాలి
పూవుల్లో దాగున్న అందాలనే
మన ముందుంచే గంధాలుగా
నేనే నిను కోరి చేరి వాలిపోవాలి
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
వ్యాఖ్యానించండి