కొమ్మా కొమ్మా విన్నావమ్మా – Komma Komma Song Lyrics – Nuvvu Vasthavani

Written by:

కొమ్మా కొమ్మా విన్నావమ్మా – Komma Komma Song Lyrics – Nuvvu Vasthavani

కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది 
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది 
ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా 
చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా 
పూల పొదరిల్లే రా రమ్మన్నది 
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని 
చుశానమ్మా స్వాగతమంటూ తెరచిన తలపులని 

పగలు రాత్రి అంటూ తేడా లేనే లేదు 
పసిపాప నవ్వుల్ని చూడని 

తోడూ నీడా నువ్వై నాతో నడిచే నీతో 
ఏనాటి ఋణముందో అడగని

చేదు చేదు కలలన్నీ కరిగితేనె వరదవని 
కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని 

ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని 
కోరుకుంటానమ్మా దేవుళ్లని 

కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది 
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని 

ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే 
ఏ పూలు తేవాలి పూజకి 
నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే 
ఇంకేమి కావాలి జన్మకి 

మచ్చలేని చంద్రుడిని మాటరాక చుస్తున్న 
వరుస కాని బంధువుని చొరవచేసి అంటున్నా 
ఇంకెప్పుడు ఒంటరినని అనరాదని 
నీకు సొంతం అంటే నేనేనని 

కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది 
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది 
ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా 
చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా 
పూల పొదరిల్లే రా రమ్మన్నది 
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని 
చుశానమ్మా స్వాగతమంటూ తెరచిన తలపులని 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి