కలలోనైన కలగనలేదే – Kalalonaina Song Lyrics – Nuvvu Vasthavani
కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
ఆ దేవుడు కరుణించి.. ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి.. ఈ బంధం కదిలొచ్చి
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే
నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది
ఓ..హో..ఓ...హో...
హే....హే...
కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
చిన్ని పెదవిపైన.. పుట్టుమచ్చకాన
చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన
కన్నె గుండెపైన.. పచ్చబొట్టుకానా
మోగుతున్న సవ్వడి వింటు మోక్షం పొందనా
జానకి నీడే...రాముని మేడ..
నీ జారిన పైటే నే కోరిన కోట
తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి
నా వలపు భాషలోని చెలియ పదమే మిగిలి ఉన్నది
ఓహో..ఓహో...
కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
కాళిదాసు నేనై.. కవితరాసుకోనా
కాలి గోటి అంచులపైన.. హృదయం ఉంచన
భామదాసు నేనై.. ప్రేమ కోసుకోనా
బంతి పూల హారాలేసి.. ఆరాదించన
నా చెలి నామం.. తారక మంత్రం
చక్కని రూపం.. జక్కన శిల్పం
వందకోట్ల చందమామలొకటై వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ
ఓహో..ఓ...హో...
కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
ఆ దేవుడు కరుణించి.. ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి.. ఈ బంధం కదిలొచ్చి
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే
నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది
ఓ..హో..ఓ...హో...
హే....హే...
వ్యాఖ్యానించండి