నీ చేపకళ్ళు – Nee Chepakallu Song Lyrics – Sardaar Gabbar Singh

Written by:

నీ చేపకళ్ళు – Nee Chepakallu Song Lyrics – Sardaar Gabbar Singh

నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే 
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే 
నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 

నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే 
నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే 
నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే 

చూడకు చూడకు చూపుల మాటకు చెంపల మైదానంలో 
చీటికి మాటికి సిగ్గులు రేపకు వంపుల పూలవనంలో 
అట్టా ఓ ఊపిరిగాలై తాకావో నువ్వు 

నన్నే ఓ మైనపు బొమ్మగ కరింగించేస్తావు 
సూరీడే నువ్వు చురుక్కు అంది అణువణువు 

నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే 
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే 
నా రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 

నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే 
నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే 
నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే 

మల్లెపూల వయ్యరమే నిన్ను చూసి మందారమై 
కందిపోయెనేడు ఎందుకిల్లా ఈతీగ లాగావని 

బంతిపూల సింగారమే రంగు రంగు బంగారమై 
చెంతచేరుకుందీ చేతులారా నాజంట కావాలని 

నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచిందీ 
అదిరే కుడివైపున కన్ను ఆహా అంటుందీ 
జోడే కుదిరింది 

నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే 
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే 
నా రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే 
నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే 
నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే 

బుగ్గ చుక్క పెట్టలిగా ముద్దు చుక్క పెట్టేయ్యనా 
ఎపుడైతెనే నీ మనస్సు నాసొంతమయ్యిందిలా 
పూలదండ మార్చాలిగా కౌగిలింత దండెయ్యనా 
ఎక్కడైతెనే రేపో మాపో కళ్యాణమవుతుందిగా 
అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటుందీ 
అవునా నువు ఆమాటంటే నాకూ బాగుంది 

తోడే దొరికింది 

నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే 
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే 
నా రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే 
నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే 
నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి