రాళ్ళళ్లో ఇసకల్లో – Rallallo Isakallo Song Lyrics – Seetharama Kalyanam

Written by:

రాళ్ళళ్లో ఇసకల్లో – Rallallo Isakallo Song Lyrics – Seetharama Kalyanam

రాళ్ళళ్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు 
కళ్ళు మూసి చిన్నగా 
కలిపి చదువుకో ఒక్కసారి 
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో 

రాళ్ళళ్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు 
కళ్ళు మూసి చిన్నగా 
కలిపి చదువుకో ఒక్కసారి 
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో 

కలలన్నీ పంటలై పండేనేమో 
కలిసింది కన్నుల పండగేమో 

చిన్ననాటి స్నేహమే అందమేమో 
అది నేటి అనురాగ బంధమేమో 

తొలకరి వలపులలో పులకించు హృదయాలలో 
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో 
ఎన్నాళ్లకీనాడు విన్నాము సన్నాయి మేళాలు 

ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై 
వినిపించు వేళలో ....ఎన్నెన్ని భావాలో..

రాళ్ళళ్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు 
కళ్ళు మూసి చిన్నగా 
కలిపి చదువుకో 
ఒక్కసారి 
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో 

చూసాను ఎన్నడో పరికిణీలో 
వచ్చాయి కొత్తగా సొగసులేవో 

హృదయాన దాచిన పొంగులేవో 
పరువాన పూచిన వన్నెలేవో 

వన్నెల వానల్లో వనరైన జలకాలలో 
వన్నెల వానల్లో వనరైన జలకాలలో 
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో 
ఆ మోహ దాహాలు మన కంటి పాపల్లో 
కనిపించు గోములో.... 

ఎన్నెన్ని కౌగిళ్లో... 

రాళ్ళళ్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు 
కళ్ళు మూసి చిన్నగా 
కలిపి చదువుకో ఒక్కసారి 
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో 

మనసుని పులకరింపజేసే మధుర కావ్యం 
ఇలాంటి మధురానుభూతులు ప్రతి ఒక్కరి జీవితంలో ఆస్వాదించే ఉంటారు.... 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి