పూసింది పూసింది పున్నాగ – Pusindi Pusindi Punnaga Song Lyrics – Seetharamaiah Gari Manavaralu

Written by:

పూసింది పూసింది పున్నాగ – Pusindi Pusindi Punnaga Song Lyrics – Seetharamaiah Gari Manavaralu

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగా 
సందేల లాగేసే సల్లంగా 
దాని సన్నాయి జల్లోన సంపెంగ 

ముల్లోకాలే కుప్పలై జడ కుప్పెలై 
ఆడ.. జతులాడ 

హహ.. పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ 
సందేల లాగేసే సల్లంగా 
దాని సన్నాయి జల్లోన సంపెంగ 

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా 
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా 
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలోచ్చాయిలే 
కలలోచ్చేటి నీ కంటి పాపాయి లే కథ చెప్పాయి లే 
అనుకోని రాగమే అనురాగ దీపమై 
వలపన్న గానమే ఒక వాయులీనమై 
పాడే...మదిపాడే 

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ 
సందేల లాగేసే సల్లంగ 
దాని సన్నాయి జల్లోన సంపెంగ 

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా 
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా 
అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే 
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే 
అల ఎంకి పాటలే ఇల పూలతోటలై 
పసి మెగ్గ రేకులే పరువాల చూపులై 
పూసే... విరబూసే.. 

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ 
సందేల లాగేసే సల్లంగ 
దాని సన్నాయి జల్లోన సంపెంగ 
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై 
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై 
ఆడ..జతులాడ.. 

పూసింది పూసింది పున్నాగా 
పూసంత నవ్వింది నీలాగ 
సందేల లాగేసే సల్లంగ 
దాని సన్నాయి జళ్లోన సంపెంగ 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి