నువ్వక్కడుంటే – Nuvvakkadunte Song Lyrics – Gopi Gopika Godavari

Written by:

నువ్వక్కడుంటే – Nuvvakkadunte Song Lyrics – Gopi Gopika Godavari

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల 
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల 
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీవేళ 
గాలిలో రాగాలమాల జంటగా తోడుంది నీలా 
నీ ఊహలో కల ఊగింది ఊయల 
ఆకాశవాణిలా పాడింది కోకిల 
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల 
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల 

సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా 
కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా 
వర్ణమై వచ్చాన వర్ణమే పాడానా 
జాణ తెలుగులా జాణ వెలుగులా 
వెన్నలై గిచ్చనా వేకువే తెచ్చనా 
పాలమడుగులా పూల జిలుగులా 
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా 
నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా 
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల 

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోలా 
ప్రతి కిరణం నీలా మారే వెలుగుల మాల 
అంతగా నచ్చానా ఆశలే పెంచానా 
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చనా రేపుగా మారానా 
ప్రేమ తరపున గీత చెరపనా 
ఎంత దూరాన నే ఉన్నా నీతోనే నే లేనా 
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా 

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల 
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల 
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీవేళ 
గాలిలో రాగాలమాల జంటగా తోడుంది నీలా 
నీ ఊహలో కల ఊగింది ఊయల 
ఆకాశవాణిలా పాడింది కోకిల 

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల 
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి