గాలి చిరుగాలి – Gali Chiru Gali Song Lyrics – Vasantham
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండనీ ఊపిరే నువ్వని
ఎన్నడు ఆగనీ పయనమే నీదని
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
కనురెప్ప మూసివున్నా నిదరొప్పుకొను అన్నా
నిను నిలువరించేనా ఓ స్వప్నమా
అమవాస్యలెన్నెయినా గ్రహణాలు ఏవైనా
నీ కలను దోచేనా ఓ చంద్రమా
తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ పోల్చదు నేలమ్మ
ఉలి గాయం చేయకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా
మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
చీకటే దారిగా వేకువే చేరగా
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా నీరాక ఆపేనా వాసంతమా
ఏ కొండరాళ్ళైనా ఏ కోన ముళ్ళైన బెదిరేనీ నీ వాన ఆషాఢమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా
కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా
సాగిపో నేస్తమా నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా
కూరిమే సాక్షిగా ఓటమే ఓడగా ...
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండనీ ఊపిరే నువ్వని
ఎన్నడు ఆగనీ పయనమే నీదని
వ్యాఖ్యానించండి