జామురాతిరి జాబిలమ్మ – Jaamu Rathiri Song Lyrics – Kshana Kshanam

Written by:

జామురాతిరి జాబిలమ్మ – Jaamu Rathiri Song Lyrics – Kshana Kshanam

జామురాతిరి జాబిలమ్మ ... జోల పాడనా ఇలా 
జోరు గాలిలో జాజి కొమ్మ ... జారనీయకే కలా 
వయ్యారి వాలు కళ్ళలోన ... వరాల వెండి పూల వాన 
స్వరాల ఊయలూగు వేళ ... 
జాము రాతిరి జాబిలమ్మ ... జోల పాడనా ఇలా 

కుహు కుహు ... సరాగాలే శృతులుగా 
కుశలమా అనే ... స్నేహం పిలువగా 
కిలకిల సమీపించే సడులతో 
ప్రతిపొద పదాలేవో పలుకగా 
కునుకు రాక ... బుట్టబొమ్మ గుబులుగుందని 
వనము లేచి వద్దకొచ్చి ... నిద్రపుచ్చనీ 

జాము రాతిరి జాబిలమ్మ ... జోల పాడనా ఇలా 
 
మనసులో భయాలన్నీ మరిచిపో 
మగతలో మరో లోకం తెరుచుకో 
కలలతో ఉషాతీరం వెతుకుతూ 
నిద్రతో నిషా రాణి నడిచిపో.. 
చిటికలోన చిక్కబడ్డ ... కటిక చీకటి 
కరిగిపోక తప్పదమ్మ ... ఉదయ కాంతికి 

జామురాతిరి (జాబి) జాబిలమ్మ ... జోల పాడనా ఇలా 
జోరు గాలిలో జాజి కొమ్మ ... జారనీయకే కలా 
వయ్యారి వాలు కళ్ళలోన ... మ్ మ్, ఆ హా 
స్వరాల ఊయలూగు వేళ ... అహ్హఅహ్హహాహ తాననానా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి