ఏ చిలిపి కళ్ళలోన – Ye Chilipi Song Lyrics – Gharshana

Written by:

ఏ చిలిపి కళ్ళలోన – Ye Chilipi Song Lyrics – Gharshana

ఏ చిలిపి కళ్ళలోన కలవో.. 
ఏ చిగురు గుండెలోన లయవో.. 
ఏ చిలిపి కళ్ళలోన కలవో.. 
ఏ చిగురు గుండెలోన లయవో.. 

నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. 
జడకుచ్చుల్లోనా మల్లెవో .. 
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. 
జడకుచ్చుల్లోనా మల్లెవో .. 
కరిమబ్బుల్లోనా విల్లువో .. 
మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. 
మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. 

ఏ చిలిపి కళ్ళలోన కలవో.. 
ఏ చిగురు గుండెలోన లయవో.. 

ఈ పరిమళము నీదేనా.. 
నాలో పరవశము నిజమేనా.. 
బొండు మల్లిపువ్వు కన్నా తేలికగు నీ సోకు.. 
రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు.. 
సొగసుని చూసి పాడగా ఎలా.. 
కనులకు మాట రాదుగా హలా.. 
వింతల్లొను కొత్త వింత నువ్వేనా.. 
ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే.. 

ఏ చిలిపి కళ్ళలోన కలవో.. 
ఏ చిగురు గుండెలోన లయవో.. 
ఏ చిలిపి కళ్ళలోన కలవో.. 
ఏ చిగురు గుండెలోన హ్మ్ హ్మ్ హ్మ్ ... 

ఆ పరుగులలో పరవళ్ళు.. 
తూలే కులుకులలో కొడవళ్ళు.. 
నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం.. 
ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పడి నీకోసం.. 
స్వరమున గీతి కోయిలా ఇలా.. 
పరుగులు తీయకే అలా..అలా.. 
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం.. 
నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం.. 

ఏ చిలిపి కళ్ళలోన కలవో.. 
ఏ చిగురు గుండెలోన లయవో.. 
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. (నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. )
జడకుచ్చుల్లోనా మల్లెవో .. (జడకుచ్చుల్లోనా మల్లెవో .. )
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. 
జడకుచ్చుల్లోనా మల్లెవో .. 
కరిమబ్బుల్లోనా విల్లువో .. 
మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. 
మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. 
మధుమాసం లోనా మంచు పూల జల్లువో..పూల జల్లువో 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి