ప్రేమ ఓ ప్రేమ – Prema O Premaa Song Lyrics – NGK Telugu

Written by:

ప్రేమ ఓ ప్రేమ – Prema O Premaa Song Lyrics – NGK Telugu

ప్రేమ ప్రేమ........ 
ఓ ప్రేమ .....
ఓ ప్రేమ .....

ప్రేమ సుడిగాలై నువ్వే ఉంటే 
చిరుగాలై చేరన 
నిషి లాగా నువ్వే ఉంటే 
నిన్ను నీడై తాకన 
నది లాగా నువ్వే ఉంటే 
చినుకై నే చిందనా 

అడిగా  బదులడిగా 
నీ అడుగై నడిచే 
మార్గం చూపుమా 
చూపుమా 

పిలిచా నిన్ను పిలిచా 
నీ కలలో నిలిచే 
మంత్రం చెప్పుమా 
చెప్పుమా 

ప్రియ మేఘం కురిసే వేళ 
పుడమెంత అందమో 
మరు మల్లి మందారాల 
చెలిమెంత అందమో 

ఎగసే అలలెగసే 
నీ ప్రేమలో అందం 
ఏదనే లాగెనే 
లాగెనే 

గుండెల్లో నిండే మొహం 
శ్వాసల్లో ధూపం వేసే 
చుట్టూరా పొగలై  కమ్మెనే 
గుట్టంతా తెలిపెనే 

తలపును వదలని యోచన 
పెరిగెను మనసున యాతన 
ప్రాయము చేసే ప్రార్థన 
పరుగున వచ్చే మొహాన 

ఓహ్ చైత్ర మాసాన మేఘమే 
చిందెను వర్షం 
కోనల్లోన మోగదా 
భూపాల రాగం 

ప్రేమ ఓ ప్రేమ 
మన నీడలా రంగులు 
నేడే కలిసేనే  
కలిసేనే  

చెలిమే మన చెలిమే 
ఒక అనువై పెరిగి 
అఖిలం అయినదే 
అయినదే 

ఓ 
అనురాగం పాడాలంటే 
మౌనం సంగీతమే 
అనుబంధం చూపాలంటే 
సరిపోదే జన్మమే

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి