కని పెంచిన మా అమ్మకే – Kani Penchina Ma Ammake Song Lyrics – Manam
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యాను గ
నడిపించిన మా నాన్న కే నాన్నయ్యాను గ
ఒకరిది కన్ను ఒకరిది చూపు
ఇరువురి కలయిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం
ఇరువురి కథలిక కదిపిన కథ
ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చె తీయగ
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చె హాయిగ
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కద!
అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్న
ఆడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్న
పిల్లలు వీళ్ళే అవుతుండగ
ఆ అల్లరి నేనే చూస్తుండగ
కన్నోల్లతో నేను చిన్నోడిల
కలగలిసిన యెగసిన బిగిసిన కథ
ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చె తీయగ
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చె హాయిగ
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కద! అ అ అ అ
కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్న
కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్న
జోలలు నాకే పాడారుగ ఆ జాలి ని మరచి పోలేను గ
మీరూపిన ఆ ఊయల నా హ్రుదయపు లయలలొ పధిలము కధ
ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చె తీయగ
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చె హాయిగ
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కద! అ అ అ అ
వ్యాఖ్యానించండి