ఆకాశం తాకేలా – Ghal Ghal Song Lyrics – Nuvvostanante Nenoddantana

Written by:

ఆకాశం తాకేలా – Ghal Ghal Song Lyrics – Nuvvostanante Nenoddantana

ఘల్ ఘల్ ఘల్ ఘల్… 
ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ 
ఘల్ ఘల్ ఘల్ ఘల్… 
ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
అందించే ఆహ్వానం ప్రేమంటే..!! 

ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా 
వినిపించే తడిగానం ప్రేమంటే..!! 

అణువణువును మీటే మమతల మౌనం 
పదపదమంటే నిలవదు ప్రాణం 
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం 

దాహంలో మునిగిన చివురుకు 
చల్లని తన చెయ్యందించి 
స్నేహంతో మొలకెత్తించే 
చినుకే ప్రేమంటే 
మేఘంలో నిద్దురపోయిన 
రంగులు అన్ని రప్పించి 
మాగాణి ముంగిట పెట్టే 
ముగ్గే ప్రేమంటే 

ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ 

ప్రాణం. ఎపుడు మొదలైందో 
తెలుపగల తేదీ ఏదో 
గుర్తించేందుకు వీలుందా..!!

ప్రణయం ఎవరి హృదయంలో 
ఎపుడు ఉదయిస్తుందో 
గమనించే సమయం ఉంటుందా..!!

ప్రేమంటే ఏమంటే 
చెప్పేసెయ్ మాటుంటే 
ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే 

అది చరితలు సైతం చదవని వైనం 
కవితను సైతం పలకని భావం 
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే..!!

దరిదాటి ఉరకలు వేసే 
ఏ నదికైనా తెలిసిందా 
తనలో ఈ ఉరవడి పెంచిన 
తొలి చినుకేదంటే 

సిరి పైరై ఎగిరేవరకు 
చేనుకు మాత్రం తెలిసిందా 
తనలో కనిపించే కళలకు 
తొలిపిలుపేదంటే 

ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ 
ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ 

మండే కొలిమినడగందే 
తెలియదే మన్ను కాదు ఇది 
స్వర్నమంటూ చూపాలంటే 
పండే పొలము చెబుతుందే 
పదునుగా నాటే నాగలిపోటే 
చేసిన మేలంటే 

తనువంతా విరబూసే 
గాయాలే వరమాలై 
దరిచేరే ప్రియురాలే గెలుపంటే 
తను కొలువై ఉండే 
విలువే ఉంటే 
అలాంటి మనసుకు 
తనంత తానై 
అడగక దొరికే వరమే వలపంటే 

జన్మంతా నీ అడుగుల్లో 
అడుగులు కలిపే జత ఉంటే 
నడకల్లో తడబాటైనా 
నాట్యం అయిపోదా 

రేయంతా నీ తలపులతో 
ఎర్రబడే కన్నులు ఉంటే 
ఆ కాంతే నువ్ వెతికే 
సంక్రాంతై ఎదురవదా 

ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ 
ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి