చందమామ కథలో చదివా – Chandamama Kadhalo Chadiva Lyrics – E Abbayi Chala Manchodu

Written by:

చందమామ కథలో చదివా – Chandamama Kadhalo Chadiva Lyrics – E Abbayi Chala Manchodu

చందమామ కథలో చదివా 
రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో 
బాలమిత్ర కథలో చదివా 
పగడపు దీవులు ఉంటాయని 
నమ్మడానికి ఎంత బాగుందో 
నాకోసం రెక్కల గుర్రం ఎక్కివస్తావని 
పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని 
ఇక ఏనాటికీ అక్కడే మనము ఉంటామనీ 
నమ్మడానికి ఎంత బాగుందో 
నమ్మడానికి ఎంత బాగుందో 

నువ్వే నాకు ముద్దొస్తావనీ 
నేనే నీకు ముద్దిస్తాననీ 
నమ్మడానికి ఎంత బాగుందో 
నమ్మడానికి ఎంత బాగుందో 

వరహాల బాటలోన రతనాల తోటలోన 
వజ్రాల మేడలోన బంగరు గదిలోన 

విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి 
నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి 

నలుదిక్కుల్లో చుక్కల్లే చిలకలు చుట్టేసి 
చిలకే కొరికి దరికే జరిగి మురిపెం పెరిగి 

మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ 
ముద్దుల్లోన ముద్దౌతాననీ 
నమ్మడానికి ఎంత బాగుందో 

చందమామ కథలో చదివా 
రెక్కల గుర్రాలుంటాయని 
నమ్మడానికి ఎంత బాగుందో 
నమ్మడానికి ఎంత బాగుందో 

ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి 
నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా 
ఆ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి 
ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచిచూసి 
అహ కళ్ళల్లో మైకంతో మోహం కమ్మేసి 

చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా 
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
తడివేదాలు ముద్రిస్తావనీ
నమ్మడానికి ఎంత బాగుందో 

నీకోసం రెక్కల గుర్రం ఎక్కివస్తానని 
పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తానని 
ఇక ఏనాటికీ అక్కడే మనము ఉంటామనీ 
నమ్మడానికి ఎంత బాగుందో 
నమ్మడానికి ఎంత బాగుందో 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి