అదిరింది మామ అదిరిందిరో – Adirindhi Mama Song Lyrics – Janaki Ramudu
అదిరింది మామ అదిరిందిరో
ముదిరింది ప్రేమ ముదిరిందిరో
ఉడుకుపుట్టి ఇన్నినాళ్ళు ఉక్క బట్టి ఉండబట్టి
వయసుపోరు తీరాలిరో
వలపు జోరు తేలాలిరో
అదిరింది పిల్లా అదిరిందిలే
కుదిరింది పెళ్లి కుదిరిందిలే
ఉడుకుపుట్టి ఇన్నినాళ్ళు ఉక్క బట్టి ఉండబట్టి
వయసుపోరు తీరాలిలే
వలపు జోరు తేలాలిలే
ఆకులిస్తా పోకలిస్తా
కొరికి చూడు ఒక్కసారి
ఆశలన్నీ వరుసపెట్టి
తన్నుకొచ్చి గిల్లుతాయి
బుగ్గమీద పంటిగాటు
పడుతుంది ప్రతిసారి
సిగ్గు చీర తొలిగిపోయి
నలుగుతుంది తొలిసారి
మాపటేల మేలుకున్న కళ్ళ ఎరుపు తెల్లవారి
మామ గొప్ప ఉరికంత చాటుతుంది మరీ మరీ
ఒకసారి కసిపూడితే
మారుసారి మతిచెడితే
వయసుపోరు తీరాలిరో
వలపు జోరు తేలాలిలే
అదిరింది పిల్లా అదిరిందిలే
కుదిరింది పెళ్లి కుదిరిందిలే
ఉడుకుపుట్టి ఇన్నినాళ్ళు
ఉక్క బట్టి ఉండబట్టి
వయసుపోరు తీరాలిరో
వలపు జోరు తేలాలిలే
పూల పక్క ముళ్ళలాగా
మారుతుంది ఎప్పుడంట
పూలు కున్న కౌగిలింత
సడలిపోతే తప్పదంట
మొదటిరేయీ పెట్టుబడికి
గిట్టుబాటు ఎప్పుడంట
మూడునాళ్ళ ముచ్చటంత
డస్సి పోతే గిట్టదంట
రేయి రేయి మొదటి రేయి కావాలంటే ఏట్టాగంటా
సూర్యుడొచ్చి తలుపు తడితే తీయకుంటే చాలంటా
తొలి రేయి గిలి పుడితే
తుది రేయి కలబడితే
వయసుపోరు తీరాలిరో
వలపు జోరు తేలాలిలే
అదిరింది మామ అదిరిందిరో
ముదిరింది ప్రేమ ముదిరిందిరో
ఉడుకుపుట్టి ఇన్నినాళ్ళు
ఉక్క బట్టి ఉండబట్టి
వయసుపోరు తీరాలిలే
వలపు జోరు తేలాలిరో
తాన నానా తానానన
తాన నానా తానానన
వ్యాఖ్యానించండి