తల్లీ తల్లీ నా చిట్టి తల్లి – Thalli Thalli Song Lyrics – Bewars

Written by:

తల్లీ తల్లీ నా చిట్టి తల్లి – Thalli Thalli Song Lyrics – Bewars

తల్లీ తల్లీ నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా 
నువ్వే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా 
నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ 
ప్రతి రోజు మురిసేనమ్మా..! ఆఆ 
ఏ జన్మలో పాపమే నేను చేశానో ఈ శిక్షే వేశావమ్మా 
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా 
నీవే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా
ఓఓ ఓఓ ఓఓఓ

పొద్దున్నే పొద్దల్లే నువ్ నాకు ఎదురైతే 
అదృష్టం నాదనుకున్నా 
సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లో 
నా దీపం నీవనుకున్నా 
నా వెలుగంతా తీసుకెళ్లి ఏ చీకట్లో కలిపేశావే 
నా ఆశల్ని మోసుకెళ్లి ఏ చితిలోన కాల్చేశావే 
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి 
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా 
నీవే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా 

లోకంలో నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా 
చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా నీలాగే తోచెనమ్మా 
నీ నిశ్శబ్దం నా గుండెల్లో. జలపాతమయ్యిందమ్మా 
ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా ఆ ఆ 
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా 
నువ్వే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి