కోటప్పకొండకు వస్తానని – Kotappa Kondaku Vasthanani – Premabhishekam

Written by:

కోటప్పకొండకు వస్తానని – Kotappa Kondaku Vasthanani – Premabhishekam

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో 
కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే 
నూటొక్క టెంకాయ కొడతానని 

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో 
బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే 
నూటొక్క టెంకాయ కొడతానని

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 
హహహ
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 

హలో... ఆ: హలో... 
హలో... ఆ: హలో... 

హలో హలో అనమంటుంది కుర్రమనసు 
చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు 
పొమ్మని పైపైకి అంటుంది 
రమ్మని లోలోన ఉంటుంది

పొమ్మని పైపైకి అంటుంది 
రమ్మని లోలోన ఉంటుంది

పొమ్మని రమ్మంటే అది స్వర్గం 
రమ్మని పొమ్మంటే అది నరకం 
ఆ స్వర్గంలోనే తేలిపోవాలి 
ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి 

ఔనంటే నువ్వు ఊ... అంటే 
హహ
ఔనంటే నువ్వు ఊ... అంటే 
నూటొక్క టెంకాయ కొడతానని

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 

గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం 
పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం 
కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము 
కళ్లు కుట్టుకుంటే గుణపాఠము 
కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి 
ఒళ్లు ఝల్లుమంటుంది తొలిసారి 
ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి 
ఆ తడి కౌగిల్లో అలిసిపోవాలి

ఔనంటే నువ్వు ఊ... అంటే 
హ
ఔనంటే నువ్వు ఊ... అంటే 
నూటొక్క టెంకాయ కొడతానని

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో 
కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే 
నూటొక్క టెంకాయ కొడతానని 

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి