అడిగి అడగలేక – Adigi Adagaleka Song Lyrics – Devadasu

Written by:

అడిగి అడగలేక – Adigi Adagaleka Song Lyrics – Devadasu

అడిగి అడగలేక 
ఒక మాటే 
అడగనా .....

అడిగి అడగలేక ఒక మాటే అడగనా 
తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా 

ఆశగా అడగనా నీ అడుగు నీ అడగనా 
మౌనమై తెలుపనా నీ దానిని తెలుపనా 

ఎన్ని జన్మలైనా జంట వీడ రాదని 

అడిగి అడగలేక ఒక మాటే అడగనా 
తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా 

నీకన్నా మెత్తనిది నీ మనసే నచ్చినది 
నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినది 

పెదవి కన్నా ఎద తీయనిది 
కనుల కన్నా తన అల్లరిది 
నవ్వు కన్నా సిగ్గే నాణ్యమైనది 
జన్మ కైనా ప్రేమే నమ్మిక అయినది 
ఎన్ని జన్మలైనా ప్రేమ మాయ రాదని 

అడిగి అడగలేక ఒక మాటే అడగనా 
తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా 

నీ కన్నా చల్లనిది నీ నీడ దొరికింది 
నీకన్నా నిజమైంది నీ తోడే నాకు ఉంది 
సొగసు కన్నా వడివాడనిధి 
బిగుసుకున్న ముడి వీడనిది 
ముల్లులేని పువ్వే ప్రేమ అయినది 
పూలు లేని పూజే ప్రేమ అన్నది 

ఏ జన్మ లోనూ పూజ మాన రాదని

అడిగి అడగలేక ఒక మాటే అడగనా 
తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా 
ఆశగా అడగనా నీ అడుగు నీ అడగనా 
మౌనమై తెలుపనా నీ దానిని తెలుపనా 
భాష చేసుకున్న మాట మార్చరాదని 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి