కొత్త కొత్తగా వున్నది – Kotta Kottaga Unnadi Song Lyrics – Coolie No 1
కొత్త కొత్తగా వున్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగానే
కొత్త కొత్తగా వున్నది
స్వర్గమిక్కడే అన్నది
నా కన్ను ముద్దాడితే
కన్నె కులుకాయే కనకాంబరం
నా చెంప సంపెంగలో
కెంపు రంగాయే తొలి సంబరం
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
ఉద్యోగామిప్పించవా షోకు ఉద్యాన వనమాలిగా
జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా
కొత్త కొత్తగా వున్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగా....నే
కొత్త కొత్తగా వున్నది
స్వర్గమిక్కడే. అన్నది
నీ నవ్వు ముద్దాడితే
మల్లెపువ్వాయే నా యవ్వనం
నాజూకు మందారమే
ముళ్ళ రోజాగా మారే క్షణం
మొగలి పరిమళం మగాడి కౌగిలి
మగువ పరవశం సుఖాల లోగిలి
మొగలి పరిమళం మగాడి కౌగిలి
మగువ పరవశం సుఖాల లోగిలి
కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా
తీగ మల్లికి నరాల పందిరి అందించుకోనా
కొత్త కొత్తగా వున్నది
స్వర్గమిక్కడే. అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగానే
కొత్త కొత్తగా వున్నది
స్వర్గమిక్కడే. అన్నది
వ్యాఖ్యానించండి