కిలకిల నవ్వే కోయిల కోసం – Kila Kila Navve Song Lyrics – Suryavamsam

Written by:

కిలకిల నవ్వే కోయిల కోసం – Kila Kila Navve Song Lyrics – Suryavamsam

కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం 

మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం 

జోలగా లాలించగా నీ నీడ దొరికింది 

కమ్మగా కలలీయగా నీ తోడూ నాకుంది 

ఎద విల్లును వంచినవాడే 
నీ రాముడు అన్నది మనసే 

గుడి తలుపులు తీయక ముందే 
వరమిచ్చెను దేవత ఎదురై 

నీవే ఆ చెలి
 
నిజమేనా జాబిలి 

కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం 

ఎదురుచూపులో ఇంత తీపని తెలయలేదు మునుపు 

ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు 

ఒదిగివుండి నీ వాకిటిలో బదులుకోరి నే నిలుచున్నా 

దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా 

ఊరించే ఇది ఏ మాసం 

ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది 

మన సొంతం అయినది 

కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం 

మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం 

మావితోట మగపెళ్ళి వారికి విడిది అంది చిలక 

మనువు ముందరే మంతనాలకి కదిలే గోరువంక 

జాబిలమ్మని జాజులతో తరలిరమ్మని అందామా 

పేద మనసుకి పెళ్ళంటే అతిధులెవ్వరు రారమ్మ 

నీకన్నా సిరుల మిన్న 

ఓ మైన మన మనువులు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది 

వధువై రానా మరి 

కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం 

మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం 

జోలగా లాలించగా నీ నీడ దొరికింది 

కమ్మగా కలలీయగా నీ తోడూ నాకుంది 

ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే 

గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై 

నీవే ఆ చెలి, నిజమేనా జాబిలి 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి