పిల్లా రా – Pilla Ra Song Lyrics – RX 100

Written by:

పిల్లా రా – Pilla Ra Song Lyrics – RX 100

మబ్బు లోన వాన విల్లులా మట్టి లోన నీటి జల్లులా 
గుండె లోన ప్రేమ ముల్లులా దాగినావుగా 
అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక 
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా 

కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే 
జాలి లేని రాక్షసివే గుండెలోని నా కసివే 
చేప కళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే 
చీకటింట నా శశివే సరసకు చెలీ చెలీ రా 

ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనపడవా 
కళ్లారా ...నిన్నే తలచి తలచిలా వున్నాగా నువ్వే యద సడివే 
అన్నాగా ... ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనపడవా 
కళ్లారా  ... నిన్నే తలచి తలచిలా వున్నాగా నువ్వే యద సడివే 

మబ్బులోన వాన విల్లులా మట్టి లోన నీటి జల్లులా 
గుండె లోన ప్రేమ ముల్లులా దాగినావుగా 
అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక 
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా 

చిన్నాదానా ఓసి అందాల మైనా 
మాయగా మనసు జారి పడిపోయెనే తపనతో 
నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే 
నీ లాగే కులికెనే నిన్ను చేరగా 
ఎన్నాళ్లయినా అవి ఎన్నేళ్లు అయినా వందేళ్లు అయినా 
వేచి వుంటాను నిన్ను చూడగ 
గండాలైనా సుడి గుండాలు అయినా 
వుంటానిలా నేను నీకే తోడుగా 
ఓ ప్రేమా మనం కలసి ఒకటిగా ఉందామా 
ఇదో ఎడతెగని హంగామా 
ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనపడవా 

అయ్యో రామా ఓసి వయ్యారి భామ 
నీవొక మరపు రాని మృదు భావమే 
కిల కిల నీ నవ్వు తళుకులే నీ కళ్ళ మెరుపులే 
కవ్విస్తూ కనపడే గుండె లోతులో 
ఏం చేస్తున్నా నేను యే చోట వున్నా చూస్తూనే వున్నా 
కోటి స్వప్నాల ప్రేమ రూపము 
గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించనా రక్త మందారాలతో 
కాలాన్నే మనం తిరిగి వెనకకే  తోద్దామా 
మళ్ళీ మన కధనే రాద్దామా 
ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనపడవా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి