జాబిల్లి కోసం ఆకాశమల్లే – Jabilli Kosam Song Lyrics – Manchi Manasulu

Written by:

జాబిల్లి కోసం ఆకాశమల్లే – Jabilli Kosam Song Lyrics – Manchi Manasulu

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ 
పాటిక్కడ పలుకక్కడ 
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ 
పాటిక్కడ పలుకక్కడ 
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా 
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా 
ఊహల్లో తేలి ఉర్రూతలూగి 
మేఘాలతోటి రాగాల లేఖ 
నీకంపినాను రావా దేవి 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది 
నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా 
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది 
నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా 
ఉండీ లేకా ఉన్నది నీవే 
ఉన్నా కూడా లేనిది నేనే 
నా రేపటి అడియాశల రూపం నీవే 
దూరాన ఉన్నా నా తోడు నీవే 
నీ దగ్గరున్నా నా నీడ నాదే 
నాదన్నదంతా నీవే నీవే 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 
వేచాను నీ రాకకై 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి