మేమే.. ఇండియన్స్ – Meme Indians – Khadgam
తికమక పెట్టే అమాయకత్వం
చకచకలాడే వేగం
అలాగ ఉంటాం ఇలాగ ఉంటాం
ఆకతాయిలం మేము
అరే చెప్పేదేదో అర్ధం అయ్యేట్టు చెప్పరా..
అట్లనే చెప్తా.. వినుకో..
సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజు తన్నుకు చస్తాం
సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజు తన్నుకు చస్తాం
నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం
నమ్మడమేరా కష్టం
అరె ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం
నచ్చకుంటే మీ ఖర్మం
అరె.. కష్టమొచ్చినా కన్నీరొచ్చినా
చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం
మేమే.. ఇండియన్స్
మేమే.. ఇండియన్స్
మేమే.. ఇండియన్స్
అరె.. మేమే.. ఇండియన్స్
మేమే.. ఇండియన్స్
మేమే.. ఇండియన్స్
మేమే.. ఇండియన్స్
మేమే.. ఇండియన్స్
వందనోటు జేబులో ఉంటే
నవాబు నైజం
పర్సు ఖాళి అయ్యిదంటే
ఫకీరు తత్వం
కళ్ళు లేని ముసలవ్వలకు
చెయ్యందిస్తాం
పడుచుపిల్ల ఎదురుగ వస్తే
పళ్ళికిలిస్తాం
ప్రేమ.. కావాలంటాం
పైసా.. కావాలంటాం
ఏవో కలలే కంటాం
తిక్క తిక్కగా ఉంటాం
ఏడేళ్ళయినా టీవి సీరియల్
ఏడుస్తూనే చూస్తాం
తోచకపోతే సినిమాకెళ్ళి
రికార్డు డాన్సింగ్ చేస్తాం
కోర్టు తీర్పుతో మనకేం పనిరా
నచ్చినోడి కోటేస్తాం
అందరు దొంగలే అసలు దొంగకే
సీటు అప్పచెప్పేస్తాం
రూలూ ఉంది..
రాంగూ ఉంది..
రూలూ ఉంది..
రాంగూ ఉంది..
తప్పుకు తిరిగే లౌక్యం ఉందీ..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
అరె మేమే.. ఇండియన్స్..
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందేమతరం
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందేమతరం
వందే... మాతరం
వందే... మాతరం
వందే... మాతరం వందే... మాతరం
కలలు కన్నీళ్ళెన్నో
మన కళ్ళల్లో..
ఆశయాలు ఆశలు ఎన్నో
మన గుండెల్లో
శత్రువుకే ఎదురు నిలిచిన
రక్తం మనది
ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది
ఈశ్వర్ అల్లా ఏసు
ఒకడే కదరా బాసు
దేవుని కెందుకు జెండా
కావాలా పార్టీ అండా
మాతృభూమిలో మంటలు రేపే
మాయగాడి కనికట్టు..
అన్నదమ్ములకు చిచ్చును పెట్టే
లుచ్చాగాళ్ళ పని పట్టు..
భారతీయులం ఒకటేనంటూ
పిడికిలెత్తి వెయి ఒట్టు
కుట్రలుచేసే శత్రుమూకల తోలు తీసి ఆరెట్టు..
దమ్మే ఉంది..
ధైర్యం ఉంది..
దమ్మే ఉంది.. ధైర్యం ఉంది..
తలవంచని తెగ పొగరే ఉంది..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
అరె మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
వ్యాఖ్యానించండి