నమ్మవేమో గాని
అందాల యువరాణి
నేలపై వాలింది
నా ముందే విరిసింది
నమ్మవేమో గాని
అందాల యువరాణి
నేలపై వాలింది
నా ముందే విరిసింది
అందుకే అమాంతం నా మది
అక్కడే నిశ్శబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది
ఇక్కడే ఇలాగే నాతో వుంది
నిజంగా కళ్ళతో
వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో
నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్ళతో
వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో
నన్నిలా ముంచివేసింది
నవ్వులు వెండి బాణాలై
నాటుకుపోతుంటే
చెంపలు కెంపు నాణాలై
కాంతిని యిస్తుంటే
చూపులు తేనె దారాలై
అల్లుకుపోతుంటే
రూపము ఈడు భారాలై
ముందర నుంచుంటే
ఆ సోయగాన్నే నే చూడగానే
ఓ రాయిలాగ అయ్యాను నేనే
అడిగ పాదముని అడుగు వేయమని
కదలలేదు తెలుసా
నిజంగా కళ్ళతో
వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో
నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్ళతో
వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో
నన్నిలా ముంచివేసింది
వేకువలోన ఆకాశం
ఆమెను చేరింది
ఓ క్షణమైనా ఆధారాల
రంగుని యిమ్మంది
వేసవి పాపం చలి వేసి
ఆమెను వేడింది
శ్వాసలలోన తల దాచి
జాలిగ కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే
ఆనందమైనా వందేళ్ళు నావే
కలల తాకిడిని మనసు తాకదిక
వెతికి చూడు చెలిని
నిజంగా కళ్ళతో
వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో
నన్నిలా ముంచివేసింది
వ్యాఖ్యానించండి