చెలియ చెలియ – Cheliya Cheliya Song Lyrics – Gharshana 

Written by:

చెలియ చెలియ – Cheliya Cheliya Song Lyrics – Gharshana 

చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా

చిగురు ఎదలో చితిగ మారినది 
విరహజ్వాలే సెగలు రేపినది 
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో 

కాలమంతా మనది కాదు అని 
జ్నాపకాలే చెలిమి కానుకని 
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా 

చెలియ చెలియ చెలియ చెలియా 
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా 
తనువు నదిలో మునిగి ఉన్నా 
చెమట జడిలో తడిసి పోతున్నా 
తడిసి పోతున్నా తడిసి పోతున్నా 

శ్వాస నీవే తెలుసుకోవే 
స్వాతి చినుకై తరలి రావే 
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం 
జాలి నాపై కలగదేమే 
జాడ అయినా తెలియదేమే 
ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీ కోసం 
ఎందుకమ్మా నీకీ మౌనం 
తెలిసి కూడా ఇంకా దూరం 
పరుగుతీస్తావు న్యాయమా ప్రియతమా 

చెలియ చెలియ చెలియ చెలియా 
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా 
తనువు నదిలో మునిగి ఉన్నా 
చెమట జడిలో తడిసి పోతున్నా 

గుండెలోన వలపు గాయం 
మంటరేపే పిదపకాలం 
ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా 
దూరమైన చెలిమి దీపం 
భారమైన బతుకు శాపం 
ప్రియతమా హృదయమా తరలిరా నే డైనా 
కలవు కావా నా కన్నుల్లో 
నిమిషమైనా నీ కౌగిలిలో 
సేద తీరాలి చేరవా నేస్తమా 

చెలియ చెలియ చెలియ చెలియా 
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా 
తనువు నదిలో మునిగి ఉన్నా 
చెమట జడిలో తడిసి పోతున్నా 
చిగురు ఎదలో చితిగ మారినది 
విరహజ్వాలే సెగలు రేపినది 
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో 
కాలమంతా మనది కాదు అని 
జ్నాపకాలే చెలిమి కానుకని 
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి