యమహా నగరి – Yamaha Nagari Song Lyrics

Written by:

యమహా నగరి – Yamaha Nagari Song Lyrics
సరిమామగరి సససనిదపసా 
సరిమామగరి సససనిదపసా 
రిమదానిదాప సాసనిదప మదపమరి 
యమహా నగరి కలకత్తా పురి 

యమహా నగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి 
యమహా నగరి కలకత్తా పురి 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 

యమహా నగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి 

నేతాజీ పుట్టిన చోట 
గీతాంజలి పూసిన చోట 
పాడనా తెలుగులో 
ఆ హంస పాడిన పాటే 
ఆనందుడు చూపిన బాట సాగనా 

పదుగురు పరుగు తీసింది పట్నం 
బ్రతుకుతో వెయ్యి పందెం 
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా 
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు 
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల  
గజి బిజి ఉరుకుల పరుగులలో 

యమహా నగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
యమహా నగరి కలకత్తా పురి 

బెంగాళి కోకిల బాల 
తెలుగింటి కోడలు పిల్ల 
మానిని సరోజిని 
రోజంతా సూర్యుడి కింద 
రాత్రంతా రజనీ గంధ సాగనీ 

పదుగురు ప్రేమలే లేని లోకం 
తేవదా మాకు మైకం 
శరన్నవలాభిషేకం తెలుసుకోరా 
కధలకు నెలవట కళలకు కొలువట 
తిధులకు సెలవట అతిధుల గొడవట 
కలకట నగరపు కిటకిటలో 

యమహా నగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
యమహా నగరి కలకత్తా పురి 

వందేమాతరమే అన్న 
వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా 
మాతంగి కాళీ నిలయ 
చౌరంగి రంగుల దునియా నీదిరా 
విను గురు సత్యజిత్ రే సితార 
ఎస్ డి బర్మన్ కీ ధారా 
థెరిస్సా కి కుమారా కదలి రారా 
జనగణమనముల స్వరపద వనముల  
హృదయపు లయలను శృతి పరిచిన 
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో 

యమహా నగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి 
యమహా నగరి కలకత్తా పురి 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
యమహా నగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి