బాపుగారి బొమ్మో – Bapu Gari Bommo Song Lyrics
హే.. బొంగరాలంటి కళ్లు తిప్పింది...
ఉంగరాలున్న జుట్టు తిప్పింది...
గింగిరాలంటి నడుమొంపుల్లో
నన్నే తిప్పింది..
అమ్మో...
బాపుగారి బొమ్మో...
ఓలమ్మో.. మల్లెపూల కొమ్మో..
రబ్బరు గాజుల రంగు తీసింది...
బుగ్గల అంచున ఎరుపు రాసింది..
రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నేగరేసింది..
అమ్మో... వాలు చూపు గమ్మో...
ఓ లమ్మో
ఓల్డ్ మాంక్ రమ్మో...
పగడాల పెదవుల్తో పడగొట్టింది
పిల్లా..
కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది...
ఏకంగా యదపైనే నర్తించింది...
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి
నిద్దర నాదే పోయింది...
అమ్మో...
బాపు గారి బొమ్మో ...
హే.. హే.. ఓలమ్మో
మల్లెపూల కోమ్మో...
మొన్న మేడమీద బట్టలారేస్తూ...
కూని రాగమేదో తీసేస్తూ...
పిడికెడు ప్రాణం..
పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా...
నిన్న కాఫి గ్లాసు చేతికందిస్తూ...
నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల... విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా...
హాయ్..
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది..
ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది..
పూలలో గుచ్చే దారం
నా గుండెల్లో గుచ్చేసింది..
చీర చెంగు చివరంచుల్లో
నన్నే భందీ చేసింది...
పొద్దు పొద్దున్నే హల్లో అంటుంది..
పొద్దు పోతే చాలు కల్లోకొస్తుంది..
పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటుంది ....
అమ్మో బాపుగారి బొమ్మో...
హే.. ఓలమ్మో...
మల్లెపూల కొమ్మో...
యే మాయా లోకంలోనో...
నన్ను మెల్లగ తోసేసింది...
తలుపులు మూసింది..
తాళం పోగెట్టేసింది...
ఆ మబ్బుల అంచుల దాకా
నా మనసుని మోసేసింది...
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది...
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది...
అందమే గంధపు గాలై
మళ్లీ ఊపిరి పోసింది...
తియ్యని ముచ్చటలెన్నో...
ఆలోచనలో అచ్చేసింది...
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది....
కోసల దేశపు రాజ కుమారి...
ఆశలు రేపిన అందాల పోరి...
పూసల దండలొ.. నన్నే గుచ్చి మెళ్ళో వేసింది...
అమ్మో బాపు గారి బొమ్మో..
హే.. ఓలమ్మో మల్లెపూల కొమ్మో...
వ్యాఖ్యానించండి