నువ్వంటే నాకెందుకో – Nuvvante Naakenduko Song Lyrics – Anthasthulu

Written by:

నువ్వంటే నాకెందుకో – Nuvvante Naakenduko Song Lyrics – Anthasthulu

నువ్వంటే నాకెందుకో .....ఇంత ఇది..
నువ్వంటే నాకెందుకో .....ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది.....
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది..

తొలినాడు ఏదోల మొదలైనది..ఈ.. 
ఆ రేయి నిదురంతా కలలయినది
తొలినాడు ఏదోల మొదలైనది..ఈ.. 
ఆ రేయి నిదురంతా కలలయినది

మరునాడు మనసంత తానయినది ..... 
ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
మరునాడు మనసంత తానయినది ..... 
ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది ...

నువ్వంటే నాకెందుకో .....ఇంత ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది.....

వయసులో పాకానికి వచ్చినది..... 
తనువులో అణూణువున పొంగినది..
వయసులో పాకానికి వచ్చినది..... 
తనువులో అణూణువున పొంగినది..

నీకిచ్చేవరకు నిలువలేనన్నది ..... 
ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది
నీకిచ్చేవరకు నిలువలేనన్నది ..... 
ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది 

నువ్వంటే నాకెందుకో ..... 
ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో 
అదే ఇది..అదే ఇది..అదే ఇది.. 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి