ఏదో ఒకరాగం – Edo Oka Raagam Song Lyrics – Raja

Written by:

ఏదో ఒకరాగం – Edo Oka Raagam Song Lyrics – Raja

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా 
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా 
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా 
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా 
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా 
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా 
జ్ఞాపకాలె మైమరపూ జ్ఞాపకాలె మేల్కొలుపూ 
జ్ఞాపకాలె నిట్టూర్పూ జ్ఞాపకాలె ఓదార్పూ 
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా 
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా 

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే 
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే 
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే 
తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం 
చిలుక ముక్కులా నీ అలక జ్ఞాపకం 
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా 
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా 

మెరిసే చూపులలో నీ చూపులు జ్ఞాపకమే 
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే 
కోవెలలోనీ దీపంలా నీ రూపం జ్ఞాపకమే 
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం 
మరుపు రాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం 
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా 
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా 
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా 
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా 
జ్ఞాపకాలె మైమరపూ జ్ఞాపకాలె మేల్కొలుపూ 
జ్ఞాపకాలె నిట్టూర్పూ జ్ఞాపకాలె ఓదార్పూ 
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా 
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి