నిండు గోదారి కదా ఈ ప్రేమ – Nindu godari Kada ee Prema Song Lyrics – Nuvvu Leka Nenu Lenu

Written by:

నిండు గోదారి కదా ఈ ప్రేమ – Nindu godari Kada ee Prema Song Lyrics – Nuvvu Leka Nenu Lenu

నిండు గోదారి కదా ఈ ప్రేమ 
అందరికి బంధువుగా ఈ ప్రేమ 
రెండు హృదయాల కథే ఈ ప్రేమ 
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ 
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ 
నిండు గోదారి కదా ఈ ప్రేమ 
అందరికి బంధువుగా ఈ ప్రేమ 

ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి 
రాజు పేద బేధమంటు లేదు దీనికి 
బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ 
ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని 
మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ 
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ 
ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది 

నిండు గోదారి కదా ఈ ప్రేమ 
అందరికి బంధువుగా ఈ ప్రేమ 
రెండు హృదయాల కథే ఈ ప్రేమ 
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ 

ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని 
ఆనకట్టలాంటి హద్దులంటు లేవని 
ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని 
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని 
ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం 
తానే లేకుంటే బతుకే వనవాసం 
ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది 

నిండు గోదారి కదా ఈ ప్రేమ 
అందరికి బంధువుగా ఈ ప్రేమ 
రెండు హృదయాల కథే ఈ ప్రేమ 
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ 
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ 
నిండు గోదారి కదా ఈ ప్రేమ 
అందరికి బంధువుగా ఈ ప్రేమ 
రెండు హృదయాల కథే ఈ ప్రేమ 
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి