నీ జతగా నేనుండాలి – Nee Jathaga Song Lyrics – Yevadu

Written by:

నీ జతగా నేనుండాలి – Nee Jathaga Song Lyrics – Yevadu

నీ జతగా నేనుండాలి 
నీ ఎదలో నే నిండాలి 
నీ కథగా నేనే మారాలి 

నీ నీడై నే నడవాలి 
నీ నిజమై నే నిలవాలి 
నీ ఊపిరి నేనే కావాలి 

నాకే తెలియని నను చూపించి 
నీకై పుట్టాననిపించి 
నీదాకా నను రప్పించావే 

నీ సంతోషం నాకందించి 
నా పేరుకి అర్ధం మార్చి 
నేనంటే నువ్వనిపించావే 

నీ జతగా నేనుండాలి 
నీ ఎదలో నే నిండాలి 
నీ కథగా నేనే మారాలి 

కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కుర్చున్నా 
రాలేదే జాడైన లేదే 

రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా 
పడుకోవే  పైగా తిడతావే 

లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే 
వదిలేస్తావ నన్నిలా 

నీ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే 
నమ్మే మాటలా ... 

నీ జతగా నేనుండాలి 
నీ ఎదలో నే నిండాలి 
నీ కథగా నేనే మారాలి 

తెలిసీ తెలియక వాలింది 
నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపూ 
ఏంచేస్తావ్ చెప్పు 

తోచని తొందర పుడుతోంది 
తెగ తుంటరిగా నను నెడుతోంది నీ వైపూ 
నీదే ఆ తప్పు 

నువ్వంటే నువ్వంటూ 
ఏవేవో అనుకుంటూ విడిగ ఉండలేముగా 
దూరంగా పొమ్మంటూ 
దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా 

నీ జతగా నేనుండాలి 
నీ ఎదలో నే నిండాలి 
నీ కథగా నేనే మారాలి 

నీ నీడై నే నడవాలి 
నీ నిజమై నే నిలవాలి 
నీ ఊపిరి నేనే కావాలి 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి